పొట్ట పేగుల్లో శబ్దాలు రావడానికి గల అసలు కారణం ఇదే?

0
76

సాధారణంగా అందరికి పొట్ట పేగుల్లో అప్పుడప్పుడు శబ్దాలు రావడం సర్వసాధారణం. కానీ మనం అవి ఎందుకు వస్తుంటాయో పెద్దగా పట్టించుకోము. మనలో చాలామంది ఆకలి అధికంగా అయినప్పుడు పొట్ట పేగుల్లో శబ్దాలు వస్తాయని అంటారు. మరికొందరు అన్నం అధికంగా తినడం వల్ల అని వస్తాయని అంటారు. కానీ పొట్ట పేగుల్లో శబ్దాలు రావడానికి గలా అసలు కారణాలు చాలామందికి తెలియదు. ఎందుకు వస్తాయో మీరు కూడా తెలుకోవాలనుకుంటున్నారా?

మ‌నం తిన్న ఆహారం జీర్ణాశ‌యంలో జీర్ణం అయ్యాక చిన్న పేగుల‌కు చేరి అక్క‌డ ఆహారంలోని పోష‌కాల‌ను శ‌రీరం శోషించుకుంటుంది. అనంతరం మిగిలిన వ్య‌ర్థాలు పెద్ద పేగు ద్వారా బ‌య‌ట‌కు పంపడం జరుగుతుంది. కడుపులో నుండి శబ్దాలు ప్రేగుల కదలిక ద్వారా ఆహారాన్ని నెట్టడం వల్ల వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ శబ్దాల వల్ల శరీరానికి ఎలాంటి హాని కలగాలని వైద్యులు సూచిస్తున్నారు.

కానీ పొట్ట పేగుల్లో పెద్దగా శబ్దాలు రావడం ప్రాణానికి ప్రమాదమట. గ్యాస్ లేదా విరేచ‌నాల స‌మ‌స్య, వికారం, వాంతులు అయ్యే వారికి అవ్వబోతున్నాయని ఇవి మనకు ముందే సూచిస్తాయి. ఒకవేళ శబ్దాలు అసలు రాకపోతే మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు అర్ధం. కావున శ‌బ్దాలు అస‌లు రాక‌పోయినా, మ‌రీ ఎక్కువ‌గా వ‌స్తున్నా వైద్యుడిని సంప్రదించటం మంచిది.