తొడభాగంలో కొవ్వు తగ్గాలంటే ఇలా చేయండి..

0
92

సాధారణంగా అందరికి ఏదో ఒక ప్రాంతంలో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. కొందరికి పొట్టచుట్టు పేరుకుపోతే..మరికొంతమందికి తొడల భాగంలో పేరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శరీరం మొత్తం సన్నగా ఉంది కేవలం తొడభాగంలో మాత్రమే కొవ్వు పేరుకుపోయి అందవిహీనంగా కనబడతారు. వారు ఈ కొవ్వును కరిగించుకోవానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఆశించిన మేరకు ఫలితాలు రాకపోతే ఈ సింపుల్ చిట్కాలను పాటించి తొడభాగంలో కొవ్వు తగ్గించుకోండిలా..

సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లు, తొడలపై ఎక్కువ ఒత్తిడి పడి  తొడ భాగంలో ఉండే కొవ్వు త్వరగా ఎలాంటి ఖర్చు లేకుండా కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎలాంటి పనులకైనా సైకిల్ వాడడం వల్ల ఈ సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా రోజు వ్యాయామాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.

పోషకాలు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గి ఫలితంగా బరువు తగ్గి..కొవ్వు కూడా కరిగిపోతుంది. ఇంకా గోడకుర్చీ వేసినట్లుగా కుర్చోటం వల్ల కూడా తొడ భాగంలోని కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ఈ సమస్య మళ్ళి మీ దరిదాపులకు రాదు. రోజు ఉదయాన్నే  జాగింగ్ చేయడం వల్ల కూడా ఈ సమస్య తగ్గిపోతుంది.