తులసి ఆకులను ఇలా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

0
91

ప్రకృతిలో వివిధ రకాల ఔషద మొక్కలు ఉంటాయి. వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. పూర్వంలో ఈ ఔషధ మొక్కలతోనే ఎలాంటి ఆరోగ్య సమస్యల చెక్ పెట్టేవారు. అంతేకాకుండా ప్రకృతిలో ఉన్న ప్రతి ఔషధ మొక్కతో ఆరోగ్యపరంగా ఏదో ఒక ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా తులసి, వేప, కలబంద గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో తులసి ఆకులను తినడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందొచ్చు అని వెల్లడయింది.

దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఒక టీస్పూన్‌ తులసి ఆకుల రసంలో అంతే మోతాదులో తేనె కలిపి రోజుకు మూడు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వివిధ రకాల సమస్యలు తొలగిపోవడంతో పాటు..దగ్గు, జలుబు, జ్వరం కూడా త్వరగా తగ్గిపోతుంది. అంతేకాకుండా తులసి ఆకులను పరగడుపునే తినడం వల్ల రక్తం బాగా తయారవడంతోపాటు..రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

అందుకే ముఖ్యంగా మహిళలు తులసి ఆకులను రోజు పరగడుపునేన తీసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. అధిక బరువుతో బాధపడేవారు రాత్రి పూట ఒక గ్లాస్‌ పలుచని మజ్జిగలో కాస్త తులసి ఆకుల రసం వేసి బాగా కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. రోజూ ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు మూడు సార్లు తాగితే ఎలాంటి సమస్యలకైనా చెక్ పెట్టొచ్చు.