దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పెరిగి ప్రజలకు కోలుకొని షాక్ ఇచ్చాయి. ఇటీవలే నిత్యావసర సరుకుల ధరలు, ఇంధనాల ధరలు పెంచడంతో ప్రజలు ఆర్థికంగా నానాతిప్పలు పడుతున్న క్రమంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెంచాయి ఆయిల్ కంపెనీలు.
ఇప్పుడే క్రమక్రమంగా కరోనా మహమ్మారి సంక్షోభం నుండి కోలుకుంటున్న ప్రజలకు ఆయిల్ కంపెనీలు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర ఏకంగా మూడున్నర రూపాయలు పెరిగింది. అలాగే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఎనిమిది రూపాయలు పెరిగింది. ఈ పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నట్టు తెలిపారు. ధరల సవరణ నేపద్యంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచినట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.