విజేత మూవీ రివ్యూ

విజేత మూవీ రివ్యూ

0
169

చిత్రం – విజేత

రిలీజ్ డేట్ : జులై 12 , 2018

దర్శకుడు : రాకేష్ శశి

సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్

నిర్మాత : సాయి కొర్రపాటి

నటి నటులు :కళ్యాణ్ దేవ్ ,మాళవిక నైర్

కథ
శ్రీనివాసరావు (మురళీశర్మ) స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే మధ్యతరగతి వ్యక్తి. కుటుంబ బాధ్యతల వల్ల తనకు ఇష్టమైన ఫోటోగ్రఫీని పక్కన పెట్టి చిరు ఉద్యోగిగా మిగిలిపోతాడు. శ్రీనివాసరావుకు తన కొడుకంటే ఎంతో ఇష్టం. రామ్ (కళ్యాణ్ దేవ్) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటాడు. ఇంటి బాధ్యతలేవి పట్టించుకోకుండా స్నేహితులతో కలిసి జులాయి గా తిరుగుతుంటాడు. ఎదురింట్లో కొత్తగా అద్దెకు దిగిన అమ్మాయిని ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే రామ్ చేసిన ఓ పనితో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురైన శ్రీనివాసరావుకు గుండెపోటు వస్తుంది. రామ్ గతంలో ప్రవర్తించిన తీరుతో అంబులెన్సు డ్రైవర్ కూడా సహాయం చేయడు. మొత్తానికి తండ్రిని ఎలాగోలా కాపాడుకుంటాడు రామ్. ఈ సంఘటనతో ఎలాగైనా జీవితంలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మరి రామ్ అనుకున్నట్టుగా నిలదొక్కుకొని “విజేత” అయ్యాడా ? ఆ అమ్మాయి రామ్ ని లవ్ చేస్తుందా ? తండ్రి కోసం రామ్ ఏం చేశాడు ? అనేవి వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
కళ్యాణ్ కు ఇదే మొదటి సినిమా అయినా బాగానే నటించాడు. తన నటనతో ఫరవాలేదన్పించాడు. ఇక హీరోయిన్ మాళవిక నాయర్ ఉన్నంతలో హుందాగా కన్పించి ఆకట్టుకుంది. గ్లామర్ ప్రదర్శనకు అవకాశం లేదు మాళవికకు. ఇక సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మురళీశర్మ. తనయుడి కోసం ఏదైనా చేసే తండ్రిగా జీవించేశాడు. కొన్ని చోట్ల అతను చూపించిన భావోద్వేగాలు కంటతడి పెట్టిస్తాయి. క్లైమాక్స్ సీన్ లో అద్భుతంగా నటించాడు. మొత్తం సినిమాని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. ఇక తనికెళ్ళ భరణి, జయప్రకాశ్, రాజీవ్ కనకాల, హీరో స్నేహితుల పాత్రధారులు తదితరులు తమ పరిధి మేరకు నటించారు.

రేటింగ్ : 2/5