బ్రేకింగ్: విద్యార్థులు పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఆటో డ్రైవర్‌కు మూర్చ..

0
97

పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలో  అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో  విద్యార్థులందరూ కలిసి ఆటోలో పరీక్షా కేంద్రానికి వెళుతుండగా..డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో  క్షణాల్లో భారీ ప్రమాదం నుండి విద్యార్థులు బయటపడ్డారు. డ్రైవర్‌కు అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో ఆటో అదుపుతప్పి కందకంలోకి  ఉసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆటోలో 20 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. అనంతరం ఈ ఘటనను గమనించిన స్థానికులు డ్రైవర్‌ ను ఆసుపత్రికి తరలించి..విద్యార్థులకు కూడా  సహాయక చర్యలను అందించారు.