స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.
ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనబడి ప్రేక్షకులను అబ్బురపరిచిన ఈ సినిమా సక్సస్ అయ్యి ప్రేక్షకులను అబ్బురపరచగా తాజాగా మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.
‘సర్కారువారి పాట’ చిత్రం టాలీవుడ్‌లో బెంచ్ మార్కును సెట్ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. విడుదలైన 12 రోజుల్లోనే భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తూ జోరు చూపిస్తుంది. ఇదే జోరు కొనసాగిస్తే మరో రెండు, మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను సాధించి లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.