బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ అధికంగా ఉండడంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇంకా నేటి ధరలు స్వల్పంగా పెరిగి పసిడి ప్రియులకు కోలుకొని షాక్ ఇచ్చాయి.
హైదరాబాద్ లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
హైదరాబాద్ మార్కెట్ లో నేడు పది గ్రాముల బంగారం ధర రూ. 52,940గా ఉంది పలుకుతుంది. ఒక్కసారే ధరలు పెరగడంతో మహిళలు బాధపడే విషయంగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వెండి ధరలు విషయానికి వస్తే కిలో వెండి ధర రూ.63,700గా నమోదు అయింది. పెరిగిన ధరలతో మహిళలు బంగారం ధరించాలంటేనే జంకావలసిన పరిస్థితి ఎర్పడింది.