ఇంకొన్ని రోజుల్లో జూన్ నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్బీఐ బ్యాంకు సెలవులకు సంబంధించి జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో అధిక సెలవులు ఉన్నందున బ్యాంకు కస్టమర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. బ్యాంకు లో ఏమైనా అత్యవసర పనులు వీలయినంత త్వరగా తీర్చుకోవడం మంచిదని ఆర్బీఐ వెల్లడిస్తుంది.
జూన్ లో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకు సెలవుల జాబితా ఇదే..
జూన్ 2 – మహారాణా ప్రతాప్ జయంతి, తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం (హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ)
జూన్ 3 – శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం (పంజాబ్)
జూన్ 5 – ఆదివారం.
జూన్ 11 – రెండవ శనివారం.
జూన్ 12 – ఆదివారం.
జూన్ 14 – సాధువు గురు కబీర్ జన్మదినం (ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా, పంజాబ్)
జూన్ 15 – గురు హర్‌గోబింద్ జయంతి (ఒడిశా, మిజోరం, జమ్మూకాశ్మీర్)
జూన్ 19 – ఆదివారం.
జూన్ 22 – ఖార్చీ పూజ సందర్బంగా సెలవు (త్రిపుర)
జూన్ 25 – నాలుగో శనివారం
జూన్ 26 – ఆదివారం.
జూన్ 30 – స్థానిక పండగ (మిజోరం)