పబ్ పై పోలీసుల మూకుమ్మడిగా దాడి..ఏకంగా 18 మంది నిందితులు అరెస్ట్

0
101

తెలంగాణాలో తాజాగా మరో పబ్ పై అనూహ్యంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసారు. ఇప్పటికే ఈ విషయంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుక్కుచప్పుడు కాకుండా ఎంతో మంది నిందితులను అదుపులోకి తీసుకోగా..తాజాగా రాంగోపాల్ పెట్ తకీల పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఒక్కసారిగా రైడ్స్ చేయడంతో పబ్ లో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న కొందరు స్థానికులు అర్ధరాత్రి వరకు పబ్ రన్ చేస్తున్నారనే కారణంతో పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు.

అనంతరం సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయగా..18 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 8 డ్యాంసింగ్ గర్ల్స్, 8 కస్టమర్స్, డిజి ఆపేటర్, ఆర్గనైజర్ ఉన్నట్టు తెలిపారు. అంతేకాకుండా సౌండ్ సిస్టం సీజ్, పబ్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఓ నిర్వాహకుడు పబ్ అనుమతి లేకుండా అమ్మాయిలతో నృత్యాలు చేస్తుండడంతో అతనిని కూడా అదుపులోనికి తీసుకొని అందరిని రాంగోపాల్ పెట్ పోలీసులకు అప్పగించారు.