మహేష్‌ ఫ్యాన్స్ కి బిగ్ సర్‌ప్రైజ్‌..

0
99

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమాలో మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనపడి అభిమానులను ఖుషి చేసాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ ను చిత్రబృందం రివీల్ చేసి అబ్బురపరిచారు.

ఈ చిత్రంలో నుంచి తీసేసిన ‘మురారి వా’ సాంగ్ ను యాడ్ చేసినట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కీర్తి సురేశ్, మహేశ్ బాబుల పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ సాంగ్ ను రైట్ టైమ్ లో రిలీజ్ చేయాలని చూశామని చిత్రబృందం తెలిపింది. అయితే ఆ పాటని డైరెక్ట్ గా యూట్యూబ్‌లో రిలీజ్‌ చేస్తామని తెలిపింది యూనిట్‌. దీంతో పాట కోసం మహేష్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.