గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్..

0
110

దేశంలో కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యప్రజలపై అదనపు భారం వేయడంతో  తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. అయితే  మొన్న ప్రజలపై కేంద్రప్రభుత్వం కాస్త కనుకరించి ఎల్పీజీ ఉపయోగిస్తున్న వారికి రూ.200 చొప్పున రాయితీ ఇస్తునట్టు ప్రకటించింది.

కానీ ప్రజలు అది విని సంతోషపడేలోపు గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేస్తునట్టు..గృహ వినియోగదారులకు ఎల్పీజీ  సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తునట్టు ఆయిల్‌ సెక్రటరీ పంకజ్‌ జైన్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. సామాన్య ప్రజలు ఇకపై మార్కెట్‌ ధరకే సిలిండర్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపి షాక్ కు గురిచేసారు.

ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1003 ఉండగా.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ అందించనున్న క్రమంలో డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ  కానున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీ లభించనుంది. దేశవ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా.. ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల పథకం కింద లబ్ధిదారులు ఉండగా..మిగిలిన వారికీ  తిప్పలు తప్పనట్టే. ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూపంలో ఊరట ఇచ్చిన కేంద్రం..గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ రూపంలో భారం మోపింది.