హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

0
98

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటనే ఓ బాలిక జీవితాన్ని అంధకారమయం చేసింది.

ఈనెల 28న ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌కు వెళ్లిన ఓ బాలిక మే 29న తన కుమార్తె మరికొందరు యువకులతో కలిసి బయటకు వెళ్లడం గమనించిన ఆమె తండ్రి అనుమానం వచ్చి బాలికను నిలదీయగా తనపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు అసలు నిజం చెప్పింది. దాంతో తండ్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసి  దర్యాప్తు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా..నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.