మీ పుత్రరత్నంను అదుపులో పెట్టుకో….. కోడెల బాబుకు గతంలో వార్నింగ్

మీ పుత్రరత్నంను అదుపులో పెట్టుకో..... కోడెల బాబుకు గతంలో వార్నింగ్

0
122

మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని నేత.. గతంలో కాపు రిజర్వేషన్ కోసం చంద్రబాబుకు మూడు చెరువుల నీళ్లు తాగించారు ముద్రగడ… చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు టీడీపీ అవినీతిపై చంద్రబాబుపై నిప్పులు చెరుగుతూ ఘాటుగా లేఖలు రాసేవారు…

ఇక ఇదే క్రమంలో మరోసారి చంద్రబాబుకు లేఖ రాసారు ఈ లేఖలో కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై స్పందించారు ఆయన… చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మాట తీరు మారిపోయిందని అన్నారు.. ప్రస్తుతం చిలకపలుకులు పలుకుతూ రాజకీయలబ్దిపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు..

అధికారంలో ఉన్నప్పుడు కోడెలను ఇంటికి పిలిపించుకుని నీ కుమారుడు వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయి అతన్ని అదుపులో పెట్టుకో అని హెచ్చరించగా మీ పుత్రరత్నం ఏమన్నా వజ్రమా అటు కోడెల బదులివ్వడం నిజం కాదా అని బదులివ్వడం నిజం కాదా అని ముద్దరగడ చంద్రబాబును ప్రశ్నించారు.