కేశినేనాని సైలెంట్ అవ్వడం వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్

కేశినేనాని సైలెంట్ అవ్వడం వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్

0
85

ఎన్నికల తర్వాత విజయవాడ ఎంపీ కేశినేని నాని హడావిడి చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చేరువులు నీళ్లు తాగించారు… సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తనకు జరిగిన అన్యాయాన్ని పరోక్షంగా వివరిస్తూ విమర్శలు చేశారు..

పార్టీతరపున పార్లమెంట్ అధ్యక్షుడుగా గల్లా జయదేవ్, అలాగే లోక్ సభలో పార్టీ నేతగా రామ్మోహన్ నాయుడును నియమించడంతో అలకమొదలు పెట్టారు నాని. ఇక ఆయన్ను చల్లార్చేందుకు రంగలోకి చంద్రబాబు నాయుడు గల్లాను దింపారు అయినా కూడా నాని తగ్గలేదు. అదే కోపంతో మాజీ మంత్రి దేవినేని ఉమా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు

దీంతో అందరు నాని బీజేపీలో చేరుతారని అందరు అనుకున్నారు.. కానీ తాను విలువలతో కుడిన వ్యక్తినని తాను టీడీపీలో ఉంటానని క్లారిటీ ఇచ్చారు. దీంతో టీడీపీ అధిష్టానం ఆయన్న లైట్ తీసుకుంది.. కృష్ణా జిల్లాలో టీడీపీ కార్యాలయంగా ఉన్న కేశినేనినాని భవన్ కూడా వేరే చోటకు మార్చారు.. దీంతో నాని కామ్ గా తన పనితాను చేసుకుంటున్నారు.. ఇటీవలే చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమాలకు కూడా నాని పాల్గొన్నారు.