పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరిగిన ధరలు

0
99

బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ మహిళలకు కాస్త ఊరట కలిగించింది. కానీ నేటి ధరలు భారీగా పెరిగి మహిళలు తీవ్ర నిరాశకు లోనయ్యేలా చేసాయి.

హైదరాబాద్ నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్లో నేడు పది గ్రాముల బంగారం ధర రూ.53,400కు చేరుకుంది. ఒక్కసారే బంగారం ధరలు భారీగా పెరగడం మహిళలు బాధపడే విషయంగానే చెప్పుకోవచ్చు. ఇక వెండి ధరల విషయానికొస్తే కిలో వెండి ధర రూ.63,570 వద్ద కొనసాగుతోంది. దాంతో బంగారం ప్రియులు కనీసం వచ్చే వారంలోనైనా ధరలు తగ్గుముఖం పట్టాలని కోరుకుంటున్నారు.