ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ అభిమానులు నిరాశచెందే ఘటన చిత్ర పరిశ్రమలకో చోటుచేసుకుంది. కెనడాకు చెందిన ఈ గాయకుడు ముఖ పక్షవాతానికి గురైనట్టు తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. జస్టిన్ తన వీడియోలో పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలిచగలడో చూపించిన వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. జస్టిన్ బీబర్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.