ఖమ్మంలో కేటీఆర్ పర్యటన క్రమంలో ఎలాంటి ఆటంకాలు కలగొద్దనే ఉద్దేశ్యంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అర్థరాత్రి నుండే బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా కార్యకర్తల ఇళ్లపై కూడా పోలీసుల దాడులు జరుపుతుండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మహిళలు అనే గౌరవం లేకుండా కర్కశంగా వ్యవహరిస్తూ బలవతంగా అరెస్ట్ చేయడం అన్యాయమని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.