భక్తుల పెద్ద మనసు..తితిదే ట్రస్టుకు రూ.2.17 కోట్ల విరాళాలు

0
111

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తూ కొంత మేరకు ఆదుకుంటున్నారు. అలాగే తితిదే నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు.. దాతల ద్వారా భారీగా విరాళాలు వచ్చాయి. శుక్రవారం భక్తులు రూ.2.17 కోట్లు విరాళాలుగా అందించారు.

టీవీఎస్‌ సంస్థ ఛైర్మన్‌ సుదర్శన్‌ తితిదే శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు రూ.కోటి ఐదు లక్షల విరాళమిచ్చారు. జీవీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ తరఫున తితిదే శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.కోటి 26 వేలు విరాళంగా అందింది. మరో ముగ్గురు భక్తులు రూ.12.5 లక్షలు ఇచ్చారు.