భారత్​లో కరోనా కలకలం..కొత్త కేసులు ఎన్నంటే?

Corona stir in India..what are the new cases?

0
43

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే సూచనలు కనిపిస్తున్నాయి.

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 12,899 మంది వైరస్​ బారినపడగా.. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,518 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది.

భారత్​లో శనివారం 13,24,591 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,14,88,807 కోట్లకు చేరింది. మరో 4,46,387 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

మొత్తం కరోనా కేసులు: 4,32,96,692

మొత్తం మరణాలు: 5,24,855

యాక్టివ్​ కేసులు: 72,474

కోలుకున్నవారి సంఖ్య: 4,26,99,363