ఆదినారాయణకు బీజేపీలోకి నో ఎంట్రీ

ఆదినారాయణకు బీజేపీలోకి నో ఎంట్రీ

0
100

జమ్మలమడుగు టీడీపీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజకీయం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతోందని రాజకీయ మేధావులు అంటున్నారు… ఈఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు…

అంతేకాదు తాను బీజేపీలో చేరుతున్నట్లు వారం రోజుల క్రితం స్వయంగా ఆది ప్రకటించారు… కానీ ఇంతవరకు ఆయన పార్టీలో చేరలేదు…దీనికి ప్రధాన కారణం ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ నాయుడేనట. చాలా కాలంగా వీరిద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయి.

ఈ విభేదాల నేపథ్యంలో ఆది బీజేసీలో చేరికను రమేష్ అడ్డువస్తున్నారని అనుచరులు మండిపడుతున్నారు… ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగు టికెట్ రాకుండా చేశారని ఇప్పుడు బీజేపీలో చేరకుండా చేస్తున్నారని ఆయన వర్గం మండిపడుతోంది.