డాక్టర్ల నిర్లక్ష్యం..నవజాత శిశువులు మృతి

0
90

హాస్పిటల్ అంటే దేవాలయం. డాక్టర్ అంటే దేవుడు. ఇది ప్రజల మనసులోని అభిప్రాయం. కానీ కొంతమంది డాక్టర్లు, హాస్పిటళ్లు వైద్యాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించాలనే వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. వీరి నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు రోడ్డు మీద పడుతుంటే మరికొంతమంది ఏకంగా ప్రాణాలనే కోల్పుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రెయిన్ బౌ హాస్పటల్ లో దారుణం దీనికి నిదర్శనం.

ఏప్రిల్ 24న సువర్ణ అనే గర్భిణీ రెయిన్ బౌ హాస్పటల్ లో చేరింది. 12 రోజల తర్వాత ఆమె కవలలను ప్రసవించింది. కానీ పుట్టిన మూడో రోజే కవలల్లో ఓ పాప చనిపోయింది. అయితే ఆ చిన్నారి పాప చికిత్సకు 19 లక్షల 90 వేలు బిల్లు వేశారు. అలాగే మరో శిశువు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందగా..ఆ శిశువు చికిత్సకు 33 లక్షల 16 వేలు బిల్లు వేసి డబ్బులు దండుకున్నారు. మొత్తం ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందగా చికిత్స పేరుతో ఇప్పటి వరకూ 60 అక్షలు పైగా హాస్పటల్ కు చెల్లించామని బాధితులు లబోదిబోమంటున్నారు.

రెయిన్ బౌ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే సంతానాన్ని కోల్పోయామని తల్లి తండ్రులు సువర్ణ, రఘునాథ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తమ పిల్లల చావుకు కారణమైన రెయిన్ బౌ హాస్పటల్ పై చర్యలు తీసుకోవాలని  భాదితులు డిమాండ్ చేస్తున్నారు.