విభిన్న రుచులు కోరుకునే భాగ్యనగర వాసుల కోసం మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కేపీహెచ్బీలోని గోకుల్ ఫ్లాట్స్ లో దక్షిణ్ విందు పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద్, గంటా శ్రీనివాస్ రావు, జయేశ్ రంజన్ లు ప్రారంభించారు. “దక్షిణ్ విందు” అనేది 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దక్షణ భారతీయ తీరప్రాంత రుచికరమైన పదార్థాల సమ్మేళనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నగరం అభివృద్దిలో గోకుల్ ప్లాట్లు, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్‌లో ఇక్కడ జనాభా సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
వారందరికి అందుబాటులో ఉంటు వారికి “దక్షిన్ విందు” దక్షిణ టిఫిన్స్, నెల్లూరు థాలీ, దక్షిణ్ మండిని అందించేందుకు సిద్దమైయ్యింది. పుట్టినరోజు పార్టీలు, కిట్టి పార్టీలు, సమావేశాలు, టేక్ అవే, ఎగ్జిక్యూటివ్ లంచ్ మరియు క్యాటరింగ్ కోసం హాళ్లను సులభతరం చేసేందుకు దక్షిన్ విందు సరైన వేదిక. “దక్షిణ్ విందు”కి సాంప్రదాయ దక్షిణ భారత విలేజ్ కోస్టల్ డెలికేసీల యొక్క వినూత్న మిశ్రమాలను అందించడంలో నైపుణ్యం ఉందని.. దక్షిణ టిఫిన్స్, నెల్లూరు థాలీ, దక్షిణ్ మండి వంటకాలను అందిస్తున్నట్లు నిర్వహకులు భాస్కర్ ,రాజలు తెలిపారు. వెజ్ ,నాన్ వెజ్ వంటకాలతో పాటు స్పెషల్ డేస్ లో ప్రత్యేక డిసెస్ ను అందుబాటులో ఉంచుతామన్నారు. భోజన ప్రియుల కోసం ఐదు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వంటకాలు ఒకే చోటు లభిస్తాయని తెలిపారు.
“దక్షిణ్ విందు” NIT- వరంగల్ మరియు BITS- పిలానీ ఇంజనీర్లచే ప్రమోట్ చేయబడింది. ఈ కార్యక్రమానికి కుకట్ పల్లి ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సినీ నటులు సాయికుమార్, సంగీత దర్శకులు ఆర్ పీ పట్నయక్, సినీ నటులు సుహాసిని, చాందిని డైరెక్టర్ బి గోపాల్, కోదండరామిరెడ్డి, విజయ్ టెలివిజన్ నటినటులు, సినీ ప్రముఖులు పాల్గోన్నారు.