కుప్పకూలిన బిల్డింగ్..శిథిలాల కింద 25 మంది

0
78

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాయక్‌నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 25 మంది వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం రెస్క్యూ టీమ్ సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.  అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.