హోటల్‌లో నరేశ్‌, పవిత్ర జంట..చెప్పుతో కొట్టబోయిన రమ్య

0
92

ప్రముఖ సినీ నటులు నరేశ్​-పవిత్రా లోకేశ్​ ప్రస్తుతం హట్ టాపిక్ గా మారారు. కొంత కాలంగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్త హల్ చల్ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ ఇద్దరు మైసూరులోని ఒక హోటల్ లో సడన్ గా దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో నరేష్ భార్య రమ్య అక్కడికి చేరుకోవడం భారీ ట్విస్ట్ నెలకొంది.

నరేశ్​-పవిత్రా లోకేశ్​ ను చూసిన రమ్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రమ్య ఆగ్రహంతో పవిత్ర లోకేశ్ ను చెప్పుతో కొట్టబోయింది. ఇందంతా జరుగుతుండగా నరేశ్ రమ్యను చూసి విజిల్స్ వేస్తూ లిఫ్ట్ లో వెళ్లిపోయారు. దీనికి  సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ సందర్బంగా నరేష్ భార్య మాట్లాడుతూ..‘నరేశ్‌ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్‌ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. దీనిపై పవిత్ర లోకేష్‌ కూడా స్పందించారు. రమ్య కావాలనే తనను బ్యాడ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైన ఉంటే హైదరాబాద్‌లో మాట్లాడకుండా.. బెంగళూరు వచ్చి నన్ను చెడ్డగా చూపించడం కరెక్ట్‌ కాదన్నారు.