రాత్రంతా ఫోన్​ ఛార్జింగ్​ పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

0
40

ప్రస్తుతం చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఫోన్లకు అలవాటు పడి విరివిగా ఉపయోగిస్తున్నారు. రోజంతా ఆఫీసుల్లో పని చేసుకుంటూ ఫోన్​ను విపరీతంగా వాడి చాలా మంది ఎక్కువగా రాత్రిళ్లు పడుకునే ముందు ఛార్జింగ్​ పెట్టి నిద్రపోతారు. కానీ రాత్రంతా ఫోన్​ ఛార్జింగ్​  పెట్టి  నిద్రపోవడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుందని, ఫోన్​ లైఫ్​ స్పాన్​ తగ్గుతుందని చాలామంది సందేహపడుతుంటారు. అయితే ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఎక్కువ వాడకంలో ఉన్నవి లిథియం-అయాన్​ బ్యాటరీలు. ఇవి ఫోన్​ ఫుల్​ ఛార్జ్​ అవ్వగానే కరెంట్ తీసుకోకుండా రిస్ట్రెక్ట్ చేసే పరికరాలను ఇన్​బిల్ట్​గా కలిగి ఉంటున్నాయి. కావున ఫోన్​ను రాత్రంతా ఛార్జింగ్​లో ఉంచితే ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

100 పర్సెంట్ ఛార్జింగ్ అయినా తర్వాత ఫోన్ ఛార్జ్‌ను తీసుకోదని వెల్లడించారు. బ్యాటరీ, ఛార్జర్​పైనా ఎటువంటి ప్రభావం కూడా ఉండదని స్పష్టం చేస్తున్నారు.  అంతేకాకుండా ఓవర్​ ఛార్జ్​ అయ్యి మంటలు చెలరేగే అవకాశం కూడా లేదని తెలిపారు. ఫోన్ చార్జర్ లో, లేదా ఇంట్లో ఏదైనా పవర్ ప్రాబ్లెమ్ ఉన్నప్పుడు మాత్రమే పేలతాయని వెల్లడించారు.