అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటి అవకాశంతో జీవితం మలుపు తిరుగుతుంది. తాజాగా ఓ మేకల కాపరికి ఇలాంటి అదృష్టమే తలుపు తట్టింది. మధ్యప్రదేశ్ అనుప్పూర్కు చెందిన వాహిద్ హుస్సేన్ అనే వ్యక్తి మేకల కాస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు.
అతని దగ్గర ఓ మేక స్వదేశీ జాతికి చెందినది ఉంది. దీని శరీరంపై ఉర్దూలో అల్లా, మహమ్మద్ అని రాసి ఉంది. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది. దీనితో అతను మేక చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశా. ఆ చిత్రాన్ని చూసి నాగపుర్కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రూ.22 లక్షలకు మేకను కొనుగోలు చేస్తానన్నాడు. ఆ ధరకు అమ్మేందుకు నేను అంగీకరించలేదు.
ఇంకా మంచి ధర రావాలని మార్కెట్ కు తీసుకొచ్చాను. తన మేకకు రూ.70లక్షలు ధర నిర్ణయించారు. ఈ మేకకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ప్రకృతి ఇచ్చిన ప్రసాదం అని అంటున్నారు.మేకను మంచి ధరకు అమ్మగా వచ్చిన డబ్బుతో నా కుమార్తెల పెళ్లి చేస్తానని వాహిద్ హుస్సేన్ అంటున్నాడు.