ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో పార్టీ నేతల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది… ప్రతిష్టాత్మకంగా జరిగిన 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గతంలో ఎన్నడు లేని విధంగా ఘోర ఓటమిని చవిచూసింది.. దీంతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్న ఫలితంగా ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…
ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం తీసుకోగా ఇటీవలే మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఇక ఇదే క్రమంలో విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోండా రాజధాని రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేశారు.. 2019 లో పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో ఇటీవలే ఆపార్టీపై విమర్శలు చేశారు.. దీంతో అందరు బోండా ఉమా ఫ్యామిలీ బీజేపీలో చేరేందుకు ఈ వ్యాఖ్యలు చేస్తోందని అంటున్నారు…