ప్రస్తుత జీవన విధానంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. జంక్ ఫుడ్ కు అలవాటు పడి అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది ఒంట్లో వేడి వల్ల ఇబ్బందులు పడుతుంటారు. దానివల్ల కలిగే నష్టాలేమిటి? వేడిని తగ్గించుకోడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలోని అధిక వేడిని మెదడులోని హైపోథాలమస్ తగ్గిస్తుంది. కాగా మన ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికి మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మన బాడీలో వేడి తీవ్రస్థాయికి చేరితే మాత్రం మలబద్దకం, తీవ్రమైన తలనొప్పి, వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేడి తగ్గేందుకు ఈ చిట్కాలు పాటించండి..
మనం కూర్చున ప్లేస్ లో తగినంత ఆక్సిజన్ లేకపోతే కూడా బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి గాలి బాగొచ్చే ప్లేస్ లోనే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. వర్క్ మధ్య మధ్యలో లేచి కూలర్, ఫ్యాన్ కింద నిలబడితే.. వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
గంటలకు గంటలకు ఒకే దగ్గర కూర్చుంటే కూడా ఒంట్లో వేడి విపరీతంగా పెరుగుతుంది. ఇలా కూర్చుంటే పైల్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పని మధ్య మధ్యలో లేచి అటు ఇటు నడవండి.
వేడి ఎక్కువైనప్పుడు ఛాతి, మనికట్టు భాగంలో ఐస్ క్యూబ్స్ లేదా చల్లని నీళ్లతో తడపాలి. ఇలా చేస్తే వేడి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.
ఒంట్లో వేడి ఎక్కువైనప్పుడు.. టీ స్పూన్ మెంతుల్ని పొడిగా చేసుకుని నీళ్లలో వేసుకుని తాగినా..లేదా మెంతుల్ని అలాగే తిన్నా వేడిమి తగ్గుతుంది.