రేపటి నుంచి ఏపీలో బాలయ్య “NBK107” సినిమా షూటింగ్

0
104

అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం” అంటూ నందమూరి బాలకృష్ణ తొలిసారిగా వ్యాఖ్యాతగా చేసిన టాక్‌ షో ‘అన్‌ స్టాపబుల్‌ విత్​ ఎన్​బీకే’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ కార్యక్రమం ‘మోస్ట్‌ వాచ్డ్‌ షో’గా అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందింది. టాక్​ షోలలో నెం.1గా నిలిచింది. విజయవంతంగా సీజన్ 1 ముగియగా ఇప్పుడు సీజన్ 2 రానుంది.

మరోవైపు బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం గోపి చంద్ మలినేనితో NBK 107 సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత అనిల్ రావిపూడితో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఇవే కాక ఆదిత్య 369కి సీక్వెల్, అఖండ సీక్వెల్ కు నందమూరి నటసింహం ప్లాన్ చేస్తున్నాడు.

అయితే NBK 107 సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. రేపటి నుంచి 26వ తేదీ వరకు కర్నూలు, గద్వాల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగనుంది. కర్నూలు, కర్నూలు నగర శివార్లలో నందమూరి బాలకృష్ణ NBK107 సినిమా షూటింగ్ జరుగనుంది. రేపు అలంపూర్, 21న యాగంటి, 22న ఓర్వకల్ గ్రీన్ కో, 23న పూడిచర్ల, 24న ఎయిర్ పోర్ట్, 25న కర్నూలు నగరంలో, 26న పంచలింగల వద్ద బాలకృష్ణ షూటింగ్ జరుగనుంది.