శుభవార్త..తగ్గిన బంగారం, వెండి ధరలు

0
37

బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 120 తగ్గి.. ప్రస్తుతం రూ.52,100 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.570 తగ్గి.. రూ.56,700 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధర రూ.52,100గా ఉంది. కిలో వెండి ధర రూ.56,700వద్ద కొనసాగుతోంది.

విజయవాడ మార్కెట్ లో 10 గ్రాముల పసిడి ధర రూ.52,100వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,700గా ఉంది.