ప్రస్తుతం తెలంగాణ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నారు… పెత్తనం కోసం ఆ పార్టీలోకి చెందిన కొందరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారు అవుతోందట….
పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ సంచలనంగా మారుతున్నారు… దీనిపై కొంతమంది తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు…. ఇతన పార్టీల నుంచి వచ్చిన వారు పెత్తనం చేయడం ఏంటని ఆరోపిస్తున్నారు… హుజూర్ నగర్ లో అభ్యర్థిని ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. కానీ వాస్తవానికి ఒక పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసిన చోట సహజంగా ఆయన చెప్పిన వాళ్లకే సీటు వస్తుంది.
అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గొడవకు దిగడం వెనుకు చంద్రబాబు నాయుడు ప్లాన్ ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… ప్రస్తుతం రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకోవటం లేదని ఆయన చూపు బీజేపీ వైపు మళ్లిందని వార్తలు వస్తుర్నాయి… అందుకే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఇదంతా రేవంత్ చేస్తున్నారని రాజకీయ మేధావులు అంటున్నారు…