రైల్వే స్టేష‌న్‌లో గ్యాంగ్ రేప్‌..న‌లుగురి అరెస్టు

0
152

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు తన కుటుంబంతో కలిసి ఫరాదాబాద్​లో నివసిస్తోంది. కొంత కాలం క్రితం ఆమెకు రైల్వేలో పని చేస్తున్న ఓ యువకుడితో పరిచయమైంది.

తనను కలవాలని అతడు మహిళను కోరగా.. గురువారం రాత్రి ఆమె రైల్వే స్టేషన్​కు వెళ్లింది. వెళ్లిన తర్వాత అతడు ఆమె ప్లాట్​ఫారమ్ నంబర్ 8-9 లో ఓ గదిలోకి తీసుకువెళ్లాడు. కొంతసేపటికి మద్యం మత్తులో ఉన్న అతడి దగ్గరికి మరో ముగ్గురు స్నేహితులు వచ్చారు. ఈ నిందితుల్లో ఇద్దరు తనపై అత్యాచారం చేశారు. మరో ఇద్దరు నిందితులు వాళ్లకు సాయం చేశారు. నిందితులు న‌లుగురూ రైల్వే ఉద్యోగులే. వాళ్లు ఎల‌క్ట్రిక‌ల్ డిపార్ట్‌మెంట్‌లో ప‌ని చేస్తున్నారు.

రైల్వే స్టేషన్​లోనే ఇలాంటి దారుణం జరగడం స్థానికంగా కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై రైల్వే అధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తుంది.