ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు కృష్ణా కరకట్టపై ఉంటున్ననివాసం అక్రమ నిర్మాణం అని అధికారులు తేల్చి చెప్పారు…
ఆమేరకు నోటీసులు కూడా ఇచ్చారు… అయితే చంద్రబాబు నాయుడు ఇంకా అదే ఇంట్లో ఎందుకు ఉంటున్నారో అర్ధం కావడంలేదని సుజనా అన్నారు… తానైతే ఎప్పుడో ఖాళీ చేసేవాడినని అన్నారు.. ప్రభుత్వం ఆ నిర్మానాన్ని కూల్చి వేస్తే దాని ద్వారా చంద్రబాబు సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు…
అలాగే రివర్స్ టెండర్లపై కూడా ఆయన స్పందించారు రివర్స్ టెండర్ ద్వారా ప్రజా ధనం మిగులుతుందంటే అంది మంచి పనే అని అన్నారు… అయితే ఎంత మిగులుతుందో స్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. కాగా ఇటీవలే సుజనా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.