ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు. అందరు కూడా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ను వాడుతారు. ప్రస్తుత రోజుల్లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడం వీటితో సెకన్లలో జరుగుతుంది. కానీ ఒకప్పుడు డబ్బులు వేయాలన్న, తీయాలన్న బ్యాంకుకు వెళ్లడం తప్పనిసరి. ఫోన్ పే, గూగుల్ పేతో రోజూ డబ్బులు తరచు పంపిస్తుంటారు. అయితే ఒకవేళ మనం వాడుతున్న ఫోన్ పోతే అందులో ఉన్న డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ను బ్లాక్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్ పే వాడుతున్న వారు 08068727374 లేదా 02268727374 నెంబర్లకు కాల్ చేయాలి. ఇప్పుడు కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడటానికి ప్రయత్నించాలి. మీరు మొబైల్ నెంబర్, చివరి ట్రాన్సాక్షన్ వివరాలు, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. తర్వాత మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది.
గూగుల్ పే వాడే వారు 18004190157 నెంబర్‌కు కాల్ చేసి అకౌంట్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. ఇది కస్టమర్ కేర్ నెంబర్. కాల్ చేసిన తర్వాత అదర్ ఇష్యూస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత స్పెషలిస్ట్‌తో మాట్లాడాలనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అకౌంట్ బ్లాక్ చేయాలని తెలియజేయాలి. దీని కన్నా ముందే మీరు మీ గూగుల్ అకౌంట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను చెప్పాల్సి ఉంటుంది.
పేటీఎం విషయానికి వస్తే 01204456456 నెంబర్‌కు కాల్ చేసి ఫోన్ పోయిందనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు వేరే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మిస్ అయిన ఫోన్‌లో ఉన్న నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీరు డివైజ్‌లలోనూ పేటీఎం నుంచి లాగ్ ఔట్ అవుతారు. తత్కాలికంగా అకౌంట్ బ్లాక్ చేయాలని భావిస్తే.. అప్పుడు పేటీఎం వెబ్‌సైట్‌లోకి వెళ్లి 24 గంటల హెల్ప్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఫ్రాడ్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు పేటీఎం మీ అకౌంట్‌ను బ్లాక్ చేస్తుంది.