మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనేక ఆహార పదార్దాలను మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటాము. అలాగే వైద్యులు కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తుంటారు. వాటిలో కొబ్బరి, బెల్లం కూడా ఒకటి.
కొబ్బరి, బెల్లం కలిపి తినడం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం , యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం , ఇనుము సమృద్ధిగా మన శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా బెల్లంతో పోలిస్తే కొబ్బరిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలామంది తిన్న ఆహారం జీర్ణం కాక..తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అలాంటి వారికి కొబ్బరి, బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గ్యాస్, కడుపుబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేయడానికి కూడా కొబ్బరి, బెల్లం సహాయపడుతుంది. ఇంకా ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే దగ్గు , జలుబు ,గొంతు నొప్పి ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం ఇలా అన్ని సమస్యల్ని కూడా తగ్గించడానికి కొబ్బరి, బెల్లం తోడ్పడుతుంది.