కేరళలో ఓ ఆసక్తికరమైన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వోద్యోగికి అయిన ఒకచోటు నుండి మరో చోటుకు బదిలీ తప్పదు. కలెక్టర్ బదిలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఏ జిల్లాలో పోస్టింగ్ ఇస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ కలెక్టర్ బదిలీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక విషయానికొస్తే ..రేణు, శ్రీరామ్ గతంలో వైద్యులుగా పని చేశారు. ఆ తరువాత చదివి ఐఏఎస్‌లుగా మారిపోయారు. దీనితో ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే వీరు పెళ్లి కూడా చేసుకున్నారు.
శ్రీరామ్ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేరళలో బదిలీలు జరిగాయి. అలప్పుళ జిల్లా కలెక్టర్ రేణు రాజ్ తాజాగా బదిలీ చేయగా ఆ స్థానంలో శ్రీరామ్ వెంకట్రామన్‌ను కలెక్టర్‌గా నియమించింది సర్కార్. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో కలెక్టర్‌గా ఉన్న భార్య.. బదిలీపై వెళ్లిపోతూ తన బాధ్యతలను భర్తకు అప్పగించింది.
అయితే అతని పోస్టింగ్‌ను రద్దు చేయాలంటూ యూడీఎఫ్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.. నిరసనలతో ఆయనకు స్వాగతం చెప్పినట్టు అయ్యింది. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయ దుమారానికి దారి తీసింది.