ఈసీ కీలక నిర్ణయం..17 ఏళ్లకే ఓటు హక్కు కోసం నమోదు

0
44

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.  ఇప్పటివరకు 18 ఏళ్లు నిండినవారు మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా  ఇకపై 17 ఏళ్లు దాటినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ సూచించింది.

18 ఏళ్లు పూర్తి కాగానే.. వారికి ఓటు హక్కు లభిస్తుందని స్పష్టం చేసింది. ఓటు హక్కు నమోదు కోసం జనవరి ఒకటో తేదీ అవసరం లేదని ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, తేదీల్లో ఓటర్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ కొత్త దరఖాస్తు ఫారాలు 2022 ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి.

ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓటరు జాబితా అప్‌డేట్‌ అవుతుందని వివరించింది. 17 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు సాంకేతికంగా తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.