తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఇదే బాటలో మరో ఉద్యమనేత నడిచారు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం కార్పొరేషన్ ఛైర్మెన్ రాజయ్య యాదవ్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాజయ్య యాదవ్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..టిఆర్ఎస్ తో 22 సంవత్సరాల చరిత్రకు నేటితో చరమ గీతం పాడుతున్నాను. నేటితో నా బాధ నుండి విముక్తి పొందుతున్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా,మెదక్ జిల్లా ఇన్చార్జిగా,గజ్వెల్ ఇన్చార్జిగా పని చేశా.
కేసీఆర్ ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. రాజ్యసభ అన్నారు కానీ నాకు ఎందుకు ఇవ్వలేదో తెలియదు. టీఆరెస్ లో ఆత్మగౌరవం లేదు. టిఆర్ ఎస్ లో ఇప్పుడు ఉద్యమకారులు లేరు. టిఆర్ఎస్ లో మనకు భాద మిగులుతుంది తప్ప అక్కడ భవిష్యత్ లేదని సహచరులకు చెప్తున్న. తలదించుకొని బతుకడం అనవసరం..కళ్ళు మొక్కి బతుకడం నాకు అవసరం లేదు.
కేసీఆర్ వాళ్ళ ఇంటి నుండి ముగ్గురు మంత్రులు వున్నారు…వారికేమి భాద ఉంది. ప్రాణం ఉన్న లేకున్నా ఆత్మ గౌరవం ముఖ్యం. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఉద్యమ కారులంతా ఒక తాటిపైకి రావాలని పిలుపునిస్తున్న. ఏ పార్టీలో చేరేది భవిష్యత్ లో చెబుతా అన్నారు.