బిగ్ షాక్..తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ పూర్తి మద్దతును తెలిపింది. ఇండస్ట్రీ సమస్యలు, ప్రొడ్యూసర్లు, థియేటర్ సమస్యలు పరిష్కారం అయ్యాక షూటింగ్స్ మళ్లీ ప్రారంభిస్తామని నిర్మాతలు ఈ మేరకు తెలియజేసారు.