ఎన్డీయేపై జేడీయూ కోపానికి కారణాలు ఇవేనా?

0
110

ఎన్డీయేకు బీహార్ సీఎం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పనున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్డీయే నుంచి జేడీయూ తప్పుకోవడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన గైర్హాజరు అవ్వడం సహా పలు సందర్భాలు చూస్తుంటే త్వరలోనే ఆయన ఎన్డీయేకు స్వస్తి పలకనున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఈ నిర్ణయం తీసుకోడానికి కారణాలు ఇవి కావొచ్చని తెలుస్తుంది.

అసెంబ్లీలో తమ కన్నా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ జేడీ(యు)నేతను సీఎం చేయడం వెనుక బిహార్‌లో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడమే బీజేపీ నేతల అసలు లక్ష్యం. ఏ క్షణమైనా తన సొంత ముఖ్యమంత్రిని తెరపైకి తీసుకువచ్చే యోచనలో భాజపా ఉందని నీతీశ్‌ అనుమానిస్తున్నారు.

తరచూ తన ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతున్న అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌కుమార్‌ సిన్హా(భాజపా నేత)ను ఆ పదవి నుంచి తప్పించాలని నీతీశ్‌కుమార్‌ ఎప్పటి నుంచో యత్నిస్తున్నా సఫలం కాలేకపోయారు.

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిలో తనను భాజపా కొనసాగనివ్వదనే అభిప్రాయానికి రావడం.

తన మంత్రి వర్గంలోకి భాజపా ఎమ్మెల్యేలను ఎవరిని తీసుకోవాలన్న స్వేచ్ఛ నితీశ్‌కు లేకుండాపోయింది. అధిక పదవులు కమలదళానికే దక్కాయి.