పెదవుల చుట్టూ ఉండే నలుపుద‌నం తొలగించుకోండిలా..

0
123

మ‌న‌లో చాలామంది పెద‌వుల చుట్టూ, పెద‌వుల పైన లేదా ముక్కు మీద‌, ముక్కుకు ఇరు వైపులా న‌ల్ల‌గా ఉంటుందని బాధపడుతుంటారు. దాంతో ఈ నలుపుదనాన్ని తొలగించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ అనుకున్న మేరకు ఫలితాలు లభించకపోవడంతో నిరాశకు లోనవుతుంటారు. అందుకే ఈ న‌లుపును దూరం చేసే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మ‌న శ‌రీరంలో విట‌మిన్ల లోపం కార‌ణంగా కూడా ఇలా పెద‌వుల చుట్టు న‌ల్ల‌గా అవుతుంది. అంతేకాకుండా ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే న‌ల్ల మ‌చ్చ‌లు, పిగ్మెంటేష‌న్, మొటిమ‌లు వంటి ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు.

కావాల్సిన పదార్దాలు: ఇందుకోసం మ‌నం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, అర టీ స్పూన్ ప‌సుపును, 2 టేబుల్ స్పూన్ల పెరుగును, ఒక చెక్క ట‌మాట ముక్క‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని, ప‌సుపును తీసుకోవాలి. త‌రువాత పెరుగును వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక ట‌మాట కాయ‌ను అడ్డంగా రెండు ముక్క‌లుగా చేసి ఒక ముక్క‌ను తీసుకోవాలి. ఈ ట‌మాట ముక్కతో ముందుగా క‌లిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ముఖంపై న‌ల్ల‌గా ఉన్న ప్రాంతంలో రాస్తూ 3 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. ఇలా మ‌ర్దనా చేసేట‌ప్పుడు బియ్యంపిండి మిశ్ర‌మం, ట‌మాట ర‌సం రెండు క‌లిసేలా చూసుకోవాలి. ఇలా రాసిన 15 నుండి 20 నిమిషాల త‌రువాత వేడి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. త‌రువాత దూదితో గులాబీ నీటిని తీసుకుంటూ ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.