రష్మీకతో చైతూ రొమాన్స్..గీత గోవిందం డైరెక్టర్ తో మరో సినిమా?

0
32

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల థాంక్యూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన మంచి సినిమాగా నిలిచింది. ఇందులో నాగచైతన్య నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇందులో మూడు షేడ్స్ లో చై నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే చై మొదటిసారిగా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో చైతూ.. సౌత్ అబ్బాయి బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, బాలరాజు ఇంట్రడ్యూసింగ్ వీడియో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం చైతూ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.

ఇక తాజాగా నాగచైతన్య కథానాయకుడిగా పరుశురామ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో పరుశురామ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గీతగోవిందం’లో రష్మిక సందడి చేసింది. ఇదే నిజమైతే తొలిసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే అవుతుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.