ఇండియన్స్ రాకపై నేపాల్ నిషేధం..ఎందుకంటే?

0
117

భారత్‌ నుంచి వచ్చే పర్యాటకులపై నేపాల్‌ నిషేధం విధించింది. కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. భారత్‌ నుంచి తిరిగివచ్చిన నేపాలీలూ పలువురు కొవిడ్‌ బారినపడినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో భారత పర్యాటకులు నేపాల్‌లోకి ప్రవేశించకుండా నిలిపివేసినట్లు చెప్పారు. నేపాల్‌లో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 1,090 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 6 నెలల్లో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.