ఎన్డీయేతో తెగదింపులు చేసుకున్న ఆర్జేడీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీయూ, కాంగ్రెస్ సహా ఏడు పార్టీలతో కూడిన సర్కార్ బిహార్‌లో కొలువుదీరింది. రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి బిహార్ సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఫాగు చౌహన్.. నీతీశ్‌తో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.