2014లో విడుదలైన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించడం జరిగింది. కార్తికేయ 1లో సినిమాలో నిఖిల్ కు జోడిగా కలర్స్ స్వాతి నటించడం జరిగింది. కార్తికేయ 2లో ఆమె నటిస్తుందని అందరూ ఊహించారు. అయితే కలర్స్ స్వాతిని మాత్రం చిత్ర బృందం పక్కన పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
కలర్ స్వాతి వివాహమైన తరువాత సినిమాలకి దూరంగా ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఆ కారణం చేతనే తనను తీసుకోలేదా అనే అనుమానాలు కూడా అభిమానులలో వ్యక్తం అయ్యాయి. అయితే నిఖిల్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ కార్తికేయ సినిమాలో కలర్ స్వాతి మెడిసిన్ పూర్తి చేస్తుంది. ఇక ఆ తరువాత పార్ట్ 2 లో మాత్రం ఆ పాత్రను కంటిన్యూ చేయలేమని తెలియజేస్తూ ఈ సినిమాలో హీరోయిన్ కు కొత్త మలుపుకు తీసుకు పోయేలా ప్లాన్ చేశామని అందుచేతనే కలర్ స్వాతిని ఈ సినిమాలో తీసుకోలేదని తెలిపారు. అందుచేతనే స్వాతిని కావాలనే పక్కన పెట్టలేదని తెలియజేశారు.