ఆ డైరెక్టర్ కు నేను వీరాభిమానిని..ఆసక్తికర విషయాలు వెల్లడించిన విజయ్ దేవరకొండ

0
39

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి.  ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్.

ఈ సందర్బంగా రౌడీ హీరో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. విక్రమ్ సినిమా డైరెక్టర్ లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాల‌కు తాను వీరాభిమాన‌ని, ఆ సినిమాటిక్ యూనివ‌ర్స్​లో ఏదో ఒక రోజు తాను కూడా భాగం అవుతాన‌నే న‌మ్మ‌క‌ముంద‌ని విజ‌య్ దేవరకొండ తెలిపారు. భవిష్యత్తులో ఆయన నుంచి పిలుపు వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు.