Home SPECIAL STORIES తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్..రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్..రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు

0
211

ఇప్పటికే కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఈ వర్షాల వల్ల కలిగిన నష్టాల నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అందుకే అందరు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలని సూచించింది.

నిన్న ఉత్తరఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాలలో ఉన్న వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు వాయువ్య ఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాలలోని తూర్పు మధ్యప్రదేశ్ లలో కొనసాగుతుంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రాగల 12 గంటలలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.

ఈ రోజు ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రదేశం వరకు సగటు సముద్రం నుండి 1.5 కిమీ ఎత్తు వద్ద కొనసాగుతుంది. దీనివల్ల తెలంగాణకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.