తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలెర్ట్..నేటి నుంచి హాల్ టికెట్లు విడుదల

0
106

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలెర్ట్.. నేటి నుంచి కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష హాల్ టికెట్లను డౌన్​లోడ్ చేసుకోవచ్చని టీఎస్​ఎల్​పీఆర్​బీ తెలిపింది.

నేటి ఉదయం 8 నుంచి ఈనెల 26 రాత్రి 12 వరకు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 28న కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది. 15,644 పోలీస్ కానిస్టేబుల్‌, 614 ఆబ్కారీ కానిస్టేబుల్‌, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఇందుకోసం 1601 పరీక్షా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. సుమారు 6,61,196 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మిగతా వివరాల కోస 9393711110, 9391005006 నంబర్లకు ఫోన్ చేయవచ్చని టీఎస్​ఎల్​పీఆర్​బీ సూచించింది.