గ్యాస్ స‌మ‌స్య క్ష‌ణాల్లో మాయం చేసుకోండిలా?

0
42

ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ సమస్య కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్య రావడానికి కారణాలు..జంక్ ఫుడ్ ను, నూనెలు, మ‌సాలా ప‌దార్థాలు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవడం వల్ల ఈ సమస్య వేధించే అవకాశం ఉంటుంది.

మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల‌ను వాడి గ్యాస్ స‌మ‌స్యతోపాటు ఇత‌ర జీర్ణాశ‌య సంబంధిత స‌మ‌స్య‌ల నుండి కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి ఈ చిట్కా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంతకీ ఆ చిట్కా ఏంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా?

ముందుగా ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి ఆ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ధ‌నియాలను, ఒక టేబుల్ స్పూన్ జీలక‌ర్ర‌ను, 3 మిరియాల గింజ‌ల‌ను, 3 ల‌వంగాలు, ఒక గ్లాస్ నీటిని, చిటికెడు ప‌సుపును వేయాలి. త‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి గ్లాస్ నీళ్లు అరగ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వడకట్టి రోజుకు ఒక పూట లేదా రెండు పూట‌లా తీసుకోవాలి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య ,అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు నుండి ఉపశమనం పొందవచ్చు.